18-11-2025 12:03:19 AM
బెల్లంపల్లి కాంగ్రెస్‌లో విపక్ష స్వరం వెనుక మంత్రి..?
మొదలైన గందరగోళం..
స్థానికం ముందు.. ఏంటీ గోల...
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 17 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీలో గగ్గోలు రేపుతున్నాయి. అసమ్మతి వేదికగా చిత్ర విచిత్రాలు ఆవిష్కృతం, కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నాయకుడు వ్యవహారం ఆ పార్టీలో తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలు చేస్తూ, మరోవైపు ఆయన సోదరుడు మంత్రి వివేక్ వెంకటస్వామికి దగ్గరగా మెదలడం జిల్లాలో చర్చనీయం శoగా మారింది...
బెల్లంపల్లి కాంగ్రెస్‌లో కొందరు సీనియర్ నాయకులు గ్రూపుగా అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నారు. బెల్లంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, ఎమ్మెల్యే గడ్డం వినోద్ మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. అవి కాస్త ఇటీవల ఎమ్మెల్యే వినోద్ పై ఘాటైన విమర్శల రూపంలో బయటపడి కలకలం సృష్టించాయి. ఇటీవన జరిగిన హైదరా బాద్ లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేత నం ఎగరవేసింది.
ఆ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించిన చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ ను బెల్లంపల్లి అసమ్మతి నేత, మునిసిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, మరికొంత మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అన్నకు దూరమవుతూ.. మరో వైపు తమ్ముడికి దగ్గరగా వ్యవహరిస్తున్న సూరిబాబు చతురత కాంగ్రెస్ కార్యకర్తలను ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పరిపాలన తీరుపై ప్రతిపక్షాలను తలదన్నే రీతిలో తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ, ప్రజల్లో అభాసుపాలుకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరిబాబుకు మంత్రి వివేక్ కు దగ్గరగా ఎలా ఉంటాడనే విషయంపై చర్చ జరుగుతుంది.
ఇందులో మంత్రి స్వార్థం ఏంటన్నది అంత చిక్కడం లేదు. ఒకటి మాత్రం ప్రచారంలో ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ తన కుమారుడినీ బెల్లంపల్లి నుంచి బరిలో దింపుతాడనే ఉవాచ. కాగా ఇదే అంశంతోనే బెల్లంపల్లి పాలిటిక్స్ పై మంత్రి వినోద్ ఇప్పటి నుంచే ఇంట్రెస్ట్ కు మొగ్గు చూపుతున్నాడనీ అనుమానాలపై పొలిటికల్ సర్కిల్ లో తెగచర్చ నడుస్తున్నది.
ఇద్దరి మధ్య ఆరని చిచ్చు...
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ గెలుపు కోసం మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు బాబు విశేష కృషిసల్పాడు. ఇదే క్రమంలో ఆయన పనితీరుపై అనూహ్యంగా ఎమ్మెల్యే వినోద్ కు అసంతృప్తి నెలకొంది. ఎవరూ ఏవిధమైన ఉప్పునందించారో.. ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొ ట్టాయి. ఎన్నికల సందర్భంలో ప్రత్యర్థి పార్టీ బీ ఆర్ ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య కాంగ్రెస్ లో కొందరికి డబ్బులిచ్చినట్లు అప్పట్లో తెగప్రచారంలో ఉంది.
ఈ క్రమంలోనే సూరిబా బుపై అసంతృప్తికి ఎన్నికల వేల బీజం పడిం ది. ఇక అప్పటి నుంచి సూరిబాబు, ఎమ్మెల్యే గడ్డం వినోద్ మధ్య మానసికంగా దూరం పెరూగుతూనే ఉంది. వారి మధ్య అప్పుడు తలెత్తిన కలహాలు రోజురోజుకూ మరింత దూరం చేస్తున్నాయి. ఆ విభేదాలు ఇటీవల మరింత తీవ్రం రూపం దాల్చి ముదిరి పాకాన పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గడ్డం వినో ద్ పై నెలకొన్న అసంతృప్తి పై గళం విప్పి అసమ్మతి నేతగా సూరిబాబు అవతారం ఎత్తాడు.
అంతే కాకుం డా ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై బహిరంగంగా ఘాటైన విమర్శలకు దిగడం ఇద్దరి మధ్య విభేదాలు పరాకాష్టకు చేరాయి. ఒక దశలో సూరిబాబు, ఎమ్మెల్యేకు మధ్య ఉన్నకాసింత స్నేహ సంబంధాలు సైతం పూర్తిగా దెబ్బతినిపోయాయి. ఈ క్రమంలో సూరిబాబు తన రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరంలో పడింది. ‘నవ్వేటోళ్ళ ముందు జారిపడినట్టు‘ అయ్యింది.
సీనియర్ కాంగ్రెస్ నేత మత్తమరి రాజమల్లు కుటుంబానికి చెందిన సూరిబాబు విద్యార్థి దశ నుంచి ఎన్‌ఎ స్‌యూఐ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రెండు పర్యాయాలు బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశారు. తన సతీమణి సరస్వతి మున్సిపల్ చైర్ పర్సన్ గా పని చేశారు.
సుదీర్ఘకాలంగా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశకుడిగా బలమైన యూత్ లీడర్ గా సూరిబాబు బలమైన ముద్ర వేసుకున్నాడు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు అనూహ్యంగా దూరమై మంత్రి గడ్డం వివేక్ దగ్గరైన సూరిబాబు రాజకీయ మనుగడ ఎంతకాలం సాగుతుందో చూడాలి మరి...
ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికలకు ముం దు బెల్లంపల్లి కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు ప్రతిపక్ష పార్టీల ముందు నవ్వుల పాలు చేస్తున్నాయి. అంతే కుండా అసమ్మతి, విబేధాలు స్థానిక సంస్థల ఎన్నికలపై తప్పక ప్రభావం చూపుతాయనీ కార్యకర్తలు ఆందోళన పడుతున్నారు. ఇదే సందర్భంలో సీని యర్ కాంగ్రెస్ లీడర్లను విస్మరించాడనే అపవాదును కూడా ఎమ్మెల్యే వినోద్ మూట కట్టుకున్నాడనే అభిప్రాయాలు కూడా కాంగ్రె స్‌లోని కొందరు సిన్సియర్ కార్యకర్తల్లో వ్యక్తం అవుతుండడం గమనార్హం..
సూరిబాబు రాజకీయ చతురత...
వినోద్, వివేక్ మధ్య ఉన్న గ్యాప్ ను సూరిబాబు ఆసరా చేసుకునే ఇలా వ్యవహరిస్తున్నాడనే అనుమానాలు కూడా లేకపోలేదు. అంతే కాకుండా తనకు సంబంధం లేని సోదరుడు ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గం లో మంత్రి వివేక్ జోక్యం చేసుకోవడమేంటన్న చర్చ కాంగ్రెస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి వివేక్, సూరిబాబును రంగంలో దించి బెల్లoపల్లి కాంగ్రెస్‌లో అసమ్మతికి ఆజ్యం పోస్తున్నాడా? అనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
మంత్రి అనుచరుడిగా నమ్మబలుకుతూ సూరిబాబు ఇస్తున్న సరికొత్త సంకేతాలు, ప్రజలకు అర్థమయ్యేలా సూరిబాబు తెలివిగా ప్రవర్తిస్తున్నాడా..? అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈ నేప థ్యంలో సూరిబాబు బెల్లంపల్లి కాంగ్రెస్ లో ప్రధాన రెబల్‌గా మారిపోయాయి. అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.
మంత్రి వివేక్ అండదండలు తనకు ఉన్నాయనే వాతావరణాన్ని సృష్టించుకోవడంలో ఈపాటికే సూరిబాబు కొం త మేర సఫలీకృతం అయినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. లేకపోతే ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పనిచేసే ధైర్య సాహసం సూరిబాబుకు ఎక్కడివన్న వాదనలపై విభిన్నమైన చర్చ నడుస్తున్నది.