calender_icon.png 18 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ.. గజ

18-11-2025 12:00:09 AM

పెరిగిన చలి తీవ్రత

కరీంనగర్, నవంబర్17(విజయక్రాంతి): ఉమ్మడిజిల్లాలో చలి తీవ్రత పెరిగింది.. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం వే ళలో ఈదురుగాలులు, మంచు కురుస్తోంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి లో 10.2, జగిత్యాల జిల్లా గోవిందారం లో 9.0, పెద్దపల్లి జిల్లా జూలపల్లి లో 10.6రాజన్న సిరిసిల్ల జిల్లా రుడ్రంగి లో సోమవారం ఉదయం వరకు  8.4 డిగ్రీలుగా నమోదయింది. జిల్లాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజుల్లో మరింత పడిపోనున్నాయి. .

డిసెంబర్ మాసంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఉదయం 9.30 గంటల వరకు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు రోడ్లమీదికి రావడం లేదు. చలి తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. చలి మంటలతో గ్రామాల్లో సేద తీరుతున్నారు. చల్లని గాలులకు పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరి స్తున్నారు. 

ఉన్ని దుస్తుల అమ్మకాల జోరు....

ఆయా జిల్లాల కేంద్రంలో వెచ్చదనం కోసం ఉన్ని వస్త్రాల కొనుగోలు మొదలైంది. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వచ్చిన చిరువ్యాపారులు ప్రత్యేక గుడారాలు వేసుకొని దుకాణాలను ఏర్పాటు చేశారు. మంకీ క్యా ప్లు, సాక్స్లు, జర్కీన్లు, స్వెటర్లు, టోపీలు, మఫ్లర్లతో చలిని ఎదుర్కోవడానికి కొనుగోలు చేస్తున్నారు. ఏడాదిలోనే కేవలం ఈ మూడు నెలలల్లోనే చలికి తప్పనిసరిగా వాడే ఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. చిన్నపిల్లల క్యాపులు రూ 50 నుంచి రూ 100 వరకు, సాక్స్లు రూ 25 నుంచి రూ 100వరకు, జర్కీన్లు రూ 100 నుంచి రూ 700 వరకు, పెద్దలకు స్వెటర్లు రూ 200 నుంచి రూ 1000 వరకు టోపీలు రూ 50 నుంచి రూ 150 వరకు, జర్కీన్లు రూ 500 నుంచి రూ 1500 వరకు, చెవుల క్యాపులు రూ 50 నుంచి రూ 100 వరకు, మహిళల క్యాపులు రూ 30 నుంచి రూ 110 వరకు, మప్లరు రూ 75 నుంచి రూ 200 వరకు లభిస్తున్నాయి.

పొగమంచు తీవ్రత దృష్ట్యా వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి: జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

----శీతాకాలం దృష్ట్యా ఉష్ణోగ్రతలు గణనీయం గా పడిపోతుండటంతో ఉదయం మరి యు రాత్రి వేళల్లో రహదారులపై పొగమం చు అధికంగా ఏర్పడుతోంది. దీనివల్ల ముం దున్న వాహనాలు స్పష్టంగా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉం టుంది ఈ నేపథ్యంలో అన్ని వాహనదారులు తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహన వేగం తగ్గించుకోవాలి, ఆవశ్యకమైతే రోడ్డు పక్కకు ఆపి పరిస్థితి మెరుగుపడిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలి.

హెడ్లై ట్లు, ఫాగ్లైట్లు ఆన్ చేసి ప్రయాణించాలి. హెడ్లైట్లు హై-బీమ్లో పెట్టకుండా లో-బీమ్లో ఉపయోగించాలి. ముందు న్న వాహనానికి సుర క్షిత దూరం పాటించాలి. ఆకస్మికంగా బ్రేక్ వేయడం ప్రమాదాలకు దారితీస్తుంది.పొగమంచు ఉన్నప్పుడు ఓవర్టేక్ చేయడం అత్యం త ప్రమాదకరం. ఎదురుగా లేదా పక్కన ఉన్న వాహనాలు స్పష్టంగా కనిపించనందున, ఓవర్టేక్ ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు.రోడ్డుపై జీ్ర బా లైన్లు, సైన్బోర్డులు కనిపించకపోవచ్చని గు ర్తుంచుకొని అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి.బైక్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్బెల్ట్‌ధరించాలి.