జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు
జిల్లా ఉపాధి అధికారిణి మాధవి
ఖమ్మం టౌన్ , ఏప్రిల్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి యన్. మాధవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నర్సింగ్ అభ్యర్థులకు విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, మొత్తం 90 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఏప్రిల్ 30 లోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 8 నుండి 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి అని పేర్కొన్నారు. బి ఎస్ సి లేదా జి ఎన్ ఎం పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, వయస్సు 22 నుండి 38 సంవత్సరాల మధ్య ఉండాలని, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు.కనీస వేతనం గుర్తింపు పొందే వరకు 2300 యూరోలు (సుమారు 2.2 లక్షలు), గుర్తింపు అనంతరం 2800 యూరోలు (సుమారు 3 లక్షలు) వేతనం నెలకు అందిస్తారని తెలిపారు.
అదనంగా వసతి, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9440051581, 9440049645, 9440052081 ఫోన్ నంబర్ల యందు సంప్రదించాలని, ఏప్రిల్ 30 లోపు దరఖాస్తులను పంపవచ్చని జిల్లా ఉపాధి అధికారిణి మాధవి సూచించారు.




