25 April, 2026 | 5:19 PM

Breaking News

దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •   ఆడపిల్లలకు వరం హెచ్పీవీ వ్యాక్సిన్   •  

సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం

25-04-2026 04:10 PM

కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుంది

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన సంస్థాగత నిర్మాణ సమావేశం ముఖ్య అతిథులుగా హాజరైన ఇంచార్జ్ దైద రవీంద్ర,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, డాక్టర్ మట్టా దయానంద్. సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం శనివారం సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పార్టీ భవిష్యత్ కార్యచరణ మరియు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. 

డాక్టర్ మట్టా దయానంద్​సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ...  కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తను పార్టీ గౌరవిస్తుందని భరోసా ఇచ్చారు. బూత్ స్థాయి నుండి పార్టీని నిర్మించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

​నాయకుల పిలుపు

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నియోజకవర్గ ఇంచార్జ్ దైద రవీంద్ర మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్  మాట్లాడుతూ.. నాయకులు మరియు కార్యకర్తల మధ్య సమన్వయం పెంచేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసి, సత్తుపల్లి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.