తిమ్మంపేట గ్రామంలో క్షుద్రపూజల కలకలం
గ్రామస్తుల గుండెల్లో భయం భయం...
ములుగు మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో లంబాడి కాలనీ నుండి అబ్బయిగూడెం,( కొత్తపేట) చేరుపల్లి గ్రామాలకు వెళ్లే మూడు బాటల మధ్య దారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అటగు వెళ్తున్న గ్రామస్తులు క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళన చెందరు. గురువారం రాత్రి చేసిఉంటరాని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఘటనా స్థలంలో ఎర్రగుడ్డ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ మూడు బాటలకాడ రోడ్డుకు మధ్యలో పెట్టారు. అదేచోట చెప్పులు పక్కకు విడిచిచారు. అదే కాకుండా గ్రామంలో రెండు చోట్ల పాత రైస్ మిల్లు ఎదురుగా శ్రీలక్ష్మి ప్రసన్న పర్టీలైజర్ ఎదురుగా పసుపు కల్లర్ నీళ్లతో రోడ్డుపై కట్లు పోచారు. గ్రామస్తులు భయందోలనకు గురవుతున్నారు.
క్షుద్ర పూజలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇలా గ్రామానికి వెళ్లే దారిలో క్షుద్ర పూజలు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామంలోకి రావాలన్నా ఆ..దారి నుంచి రావాల్సి ఉంటుందని తెలిపారు. అందరూ అక్కడి నుంచే రావాల్సే ఉంటుందని.. పిల్లలకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఇలాంటి క్షుద్ర పూజలు గ్రామానికి అరిష్టం చేయడానికే ఎవరైనా ఇలా చేస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు క్షుద్ర పూజలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






