01-11-2025 10:28:16 AM
పేరూరు పంచాయతీ నుండి పలు నాయకుల చేరికలు.
వాజేడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, మండలంలో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల సేవలకు ఆకర్షితులైన బిజెపి బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోరం పగిడయ్య,ఆత్మకూరు ప్రవీణ్ ఆత్మకూరి రాఘవ రాజు గొబ్బూరి రఘుపతి, కురసం రాంబాబు,తనూరి జయరాజులకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి పౌరుడికి అందేలాగా కృషి చేస్తామని అన్నారు. మండల నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంచులూరి విశ్వనాథ ప్రసాదరాజు, దాట్ల సీతారామరాజు, సొసైటీ ఉపాధ్యక్షులు జగన్నాథ రాజు, నాయకులు ఎస్.కె ఖాజావలి, కాకర్లపూడి కళ్యాణ్, రమేష్, కురుశం కృష్ణమూర్తి, బంధం కృష్ణ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు