01-11-2025 11:12:50 AM
హైదరాబాద్: హైడ్రా వీకెండ్ కూల్చివేతలు ప్రారంభించింది.మియాపూర్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లాయి. మియాపూర్‌లో ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా(Hydra demolitions) కూల్చివేస్తోంది. హైడ్రా, హెచ్ఎండీఏ సిబ్బంది సర్వే నంబర్ 100లో భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు. మియాపూర్ లో సర్వే నంబర్ 100లో భారీ భవనంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు మార్చి అక్రమంగా నిర్మిస్తున్నారని హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో స్థానికులు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 100లో అక్రమంగా 307, 308 సృష్టించారని తమకు ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అధికారులు(Hydra officials) తెలిపారు. హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తొలగించి భవనం నిర్మించారని హైడ్రా(Hydra) పేర్కొంది. మియాపూర్‌లో పోలీసుల పహారా మధ్య అధికారులు భవనాన్ని కూల్చుతున్నారు. కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.