18 March, 2026 | 5:27 AM

బాధ్యతారాహిత్యం..

18-03-2026 02:10 AM

బీజేఎల్పీ నేత ఏలేటి 

ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కేవలం 5 రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించాలని చూడటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని బీజేఎల్పీ నేత ఏలేటి మహే శ్వర్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలమయమని, రాష్ట్రంపై ఉన్న అప్పుల భారం, రైతుల సమస్యల ప్రస్తావనే లేదని ఆక్షేపించారు. ప్రభుత్వానికి సొంత డబ్బా కొట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని ధ్వజమెత్తారు. 30 రోజులపాటు నిర్వహించాలని అడిగినా ప్రభు త్వం భయపడుతోందన్నారు.