వన్డే ప్రపంచకప్ వేదికలు ఖరారు
24 ఏళ్ల తర్వాత ఆఫ్రికాలో ప్రపంచకప్
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల ఆతిథ్యం
12 వేదికలను ప్రకటించిన ఐసీసీ
‘త్రీ నేషన్స్, వన్ హార్ట్‌బీట్’ థీమ్ ఆవిష్కరణ
జోహెనస్ బర్గ్, జూలై ౩౧: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ఆతిథ్యమిచ్చే నగరాల జాబితాను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలోని 12 వేదికల్లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. దక్షిణాఫ్రికాలోని జోహెనస్ బర్గ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో త్రీ నేషన్స్, వన్ హార్ట్ బీట్ థీమ్ పేరిట ఆతిథ్య నగరాలను ప్రకటించారు. ఇది 3 అతిథ్య దేశాల మధ్య ఆశావాదం, వైవిధ్యం, ఐక్యతకు సూచిక అని ఐసీసీ పేర్కొంది.
ప్రపంచ కప్ 14వ ఎడిషన్‌లో మొత్తం 14 జట్ల మధ్య 57 మ్యా చ్‌లు జరుగుతాయి. ఐసీసీ ప్రకటించిన 12 వేదికల్లో దక్షిణాఫ్రికాలోని ఎనిమిది నగరాలు, జింబాబ్వేలో మూడు నగరాలు, నమీ బియా రాజధాని విండ్ హోక్ ఆతిథ్య వేదికలుగా ఎంపికయ్యాయి. దాదాపు 24 సంవ త్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల వన్డే ప్రపంచకప్‌కు మళ్లీ ఆఫ్రికా ఖండం ఆతిథ్యమిస్తోంది. చివరిసారిగా 2003లో వన్డే ప్రపంచకప్ ఆఫ్రికాలోనే జరిగింది.
కాగా ఈ టోర్నీలో మెజారిటీ భాగం మ్యాచ్‌లు సౌతాఫ్రికాలోనే జరగనున్నాయి. ఆధునిక స్టేడి యాల, మౌలిక వసతులు, ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా అక్కడే 8 నగరాలను ఐసీసీ ఎంపిక చేసింది. జింబాబ్వేలో 3 వేదికలు, నమీబి యా రాజధాని విండ్కోలో ఒక వేదికలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జోహన్నెస్ బర్గ్ చారిత్రాత్మక వాండరర్స్ స్టేడియంలో ఈ టోర్నీ ప్రారంభవేడుకలతో పాటు ఫైనల్ జరగనుంది.
24 ఏళ్ల తర్వాత మెగా ఈవెంట్ ఆఫ్రికాకు తిరిగి రావడం క్రికెట్ చరిత్రలో కీల క మైలురాయిగా మిగిలిపోతుందని ఐసీసీ ఛైర్మన్ జై షా వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు మర్చిపోలేని వి ధంగా క్రికెట్ టోర్నీని నిర్వహిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ టోర్నీ క్రికెట్‌కు ఉన్న ఆదరణను మరింత విస్తరించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త బ్రాండ్ థీ మ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఏకం చేసే ఒక అద్భుతమైన ప్రయా ణానికి పునాది వేసిందన్నారు. ఈసారి 50 ఓవర్ల వరల్డ్ కప్ కొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.
వేదికల వివరాలు
దక్షిణాఫ్రికా : వాండరర్స్ (జోహెనస్ బర్గ్), సెంచూరియన్ (ష్వానే), న్యూలాండ్స్ (కేప్ టౌన్), కింగ్స్‌మీడ్ (డర్బన్), సెయింట్ జార్జ్ పార్క్ (గెబెర్హా), మంగాంగ్ ఓవల్ (బ్లూమ్ఫోంటెన్), బోలాండ్ పార్క్ (పార్ల్), బఫె లో పార్క్ (కుగోంపో సిటీ).
జింబాబ్వే : హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), ఫాలే మోసీ-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికె ట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్).
నమీబియా : నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండ్‌హక్).






