లంకతో సిరీస్‌కు బుమ్రా ఫిట్
బెంగళూరు, జూలై 31 : శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టుకు శుభవార్త అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది. దీంతో ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ ఇటీవల జట్టును ప్రకటించింది.
ఈ జాబితాలో బుమ్రాకు చోటు దక్కి నా ఫిట్‌సెస్ క్లియరెన్స్ వస్తేనే మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడని పే ర్కొంది.ఇటీవలఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా గాయపడ్డాడు. లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే కూడా ఆడలేదు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో ఆడడం ఖాయమైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే లంకతో సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. మిగిలిన తొమ్మిది టెస్టుల్లో కనీసం ఏడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. లంకపై 2-0తో సిరీస్ గెలిస్తే ఫైనల్ రేసులో ఉంటుంది.






