15-01-2026 12:23:46 AM
నిష్క్రమించిన తెలుగు రాష్ట్రాల జట్లు
నేడే ఖో ఖో సీనియర్ నేషనల్ ఫైనల్స్
హనుమకొండ టౌన్, జనవరి 14 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహిస్తున్న 58వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ లో ఒడిశా పురుషుల , మహిళల జట్లు జోరు కొ నసాగించి సెమిస్ కి చేరాయి. ఈ జాతీయ స్థాయి పోటీలో తెలుగు రాష్ట్రాల జట్లు క్వా ర్టర్ ఫైనల్లోనే నిష్క్రమించి నిరాశపరిచాయి. నువ్వా నేనా అన్నట్లు సాగిన పురుషుల ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 28-21 స్కో ర్ తేడాతో ఆతిథ్య తెలంగాణ జట్టుకు షాక్ ఇచ్చింది.
కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో తెలంగాణ జట్టులోని డిఫెండర్లు ఆశించిన మేర రాణించకపోవడం, ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపంతో చేజింగ్ లో అధిక ఫౌల్స్, వ్యూహాలు వికటించిన ఫలితం గా ఓటమి పొందారు. క్వార్టర్ ఫైనల్స్ ఫలితాలు పురుషుల విభాగంలో నిరుటి విజేత రైల్వేస్ జట్టు కర్ణాటక పై 23 -15 స్కోర్ తేడా తో గెలుపొందింది. మరో మ్యాచ్లో ఒడిశా జట్టు 29-23 స్కోర్ తేడాతో ఓడించి సెమిస్ కు చేరింది. కొల్హాపూర్ జట్టు ఢిల్లీ పై 36 -24 స్కోర్ తో గెలుపొందింది. చివరి క్వార్టర్ ఫైన ల్లో ఆంధ్ర జట్టు 16- 23 స్కోర్ తో నిరుటి రన్నరప్ మహారాష్ట్ర చేతిలో పరాజయం పా లైంది. సెమీఫైనల్ లో రైల్వేస్, ఒడిషాతో, కొ ల్హాపూర్, మహారాష్ట్రతో తలపడనున్నాయి.
మహిళల విభాగంలో
మహిళల క్వార్టర్ ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ మహారాష్ట్ర 20-7 స్కోర్ తో పశ్చిమబెంగాల్ పై, ఢిల్లీ కొల్హాపూర్ పై 27- 25 స్కోర్ తో, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇం డియా 24- 15 స్కోర్ తేడాతో గుజరాత్ పై, నిరుటి రన్నరప్ ఒడిషా 24-20 స్కోర్ తేడా తో కర్ణాటక పై విజయం సాధించి సెమిస్ లోకి ప్రవేశించాయి. సెమిస్ లో మహారాష్ట్ర, ఢిల్లీతో, ఒడిషా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అమీతుమీకి సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన మ్యాచ్ లను భారత ఖో ఖో సమాఖ్య చైర్మన్ త్యాగి, ప్రధాన కార్యదర్శి ఉప్కార్ సింగ్, భారత ఖోఖో సమాఖ్య ఎథిక్స్ కమిషన్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ప్రారంభించగా ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, పోటీల నిర్వహణ కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, రాజారపు రమేష్ లు తదితరులు పాల్గొన్నారు.