calender_icon.png 15 January, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన

15-01-2026 12:28:55 AM

రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలన కక్షలతోని ప్రతికార చర్యలతో కొనసాగుతుంది 

ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయి 

నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం అప్రాజస్వామికమని, అరెస్టులను ఖండిస్తున్నాం 

శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి 

హనుమకొండ టౌన్, జనవరి 14 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా బాలస ముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ కా ర్యాలయంలో బుధవారం మాజీ చీఫ్ విప్, బిఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన విలేకరుల సమావేశంలో శాసలమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన సౌల భ్యం కోసం జిల్లాల విభజన చేయడం జరిగిందని అంతేకానీ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞత ఉం టే ప్రజలకు అవసరమయ్యే పనులు చేయాలని, భరోసా ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని, రైతు మరణిస్తే రైతు బీమా పథకాన్ని కేసీఆర్ అమలు చేశారని కానీ కెసిఆర్ ఆనవాళ్లు చెరిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారని అన్నారు.

జిహెచ్‌ఎంసిలో 150 డివిజన్ల నుండి 300 డివిజన్లను, 33 జిల్లాలు కెసిఆర్ ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి వాటిని తక్కువ జిల్లాలను చేస్తాననడం విడ్డూరమని, రెండు జోన్లతో ఆవిర్భావమైన తెలంగాణలో కెసిఆర్ 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేల రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించి, ఏడు జోన్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని అన్నా రు. బిఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని, మేడారం పండుగకు కాంగ్రెస్, బిజెపిలు జాతీయ హో దా కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జాతరకు సరిపడా నిధులు కేటాయించడం లేదని అన్నారు.

పనిచేస్తున్నారని, 420 హామీలు, 6 గ్యారంటీలు నెరవేర్చాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్, పెన్షనర్లకు పెన్షన్ పెంపు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో ఏనుమాముల వ్యవసాయ మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, కార్పొరేటర్లు సోదా కిరణ్, చెన్నం మధు, టిఆర్‌ఎస్ నాయకులు ఇమ్మడి రాజు, ఎండి నైముద్దీన్, శోభన్, సల్వాజ్ రవీందర్రావు, పానుగంటి శ్రీధర్, జుబేర్, ఎండి గౌస్ ఖాన్, ఎలిషా, సౌరం రఘు, సంపతి రఘు, ఎస్ కే మైముద్, తక్కల్లపల్లి వినీత్ రావు, ఇమ్మడి స్నేహితు, జేకే తదితరులు పాల్గొన్నారు.