13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

మంథని మున్సిపల్ చైర్మన్ గా ఓడ్నాల శ్రీనువాస్

16-02-2026 12:21 PM

వైస్ చైర్మన్ గా ముసుకుల సయేందర్ రెడ్డి

కౌన్సిలర్ లతో ప్రమాణ స్వీకారం చేయించిన మంథని ఆర్డీఓ సురేష్, కమిషనర్ మనోహర్

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ చైర్మన్(Manthani Municipal Corporation) గా ఓడ్నాల శ్రీనువాస్ నువైస్ చైర్మన్ గా ముసుకుల సయేందర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ లతో  మంథని ఆర్డీఓ సురేష్, కమిషనర్ మనోహర్ లు ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లు మాట్లాడుతూ తమ పై నమ్మకంతో తమను చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్లకు,  సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు యువ నాయకుడు శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రాబోయే రోజుల్లో మంతిని పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కష్టపడతామని, మంథని పట్టణ ప్రజలు 13 కౌన్సిలర్ లకు గాను 11 మంది కాంగ్రెస్ పార్టీ  కౌన్సిలర్ లను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.