13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఎవ్వరూ అరెస్టు కాలేదు

16-02-2026 12:19 PM

మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ నాతోనే బస్సులో ఉన్నారు 

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

మహబూబ్ నగర్, (విజయ క్రాంతి) : మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో పాటు మరెవ్వరు అరెస్టు కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరాధారమైన వార్తలు, అపోహలు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తనతోనే బస్సులో ఉన్నారని, ఎటువంటి అరెస్టు జరగలేదని ఆయన స్పష్టతనిచ్చారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, వదంతులను పంచుకోవద్దని సూచించారు. అసత్య ప్రచారాలను ఖండిస్తూ, పార్టీ కార్యకర్తలు నాయకులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.