11 April, 2026 | 3:51 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

శివపార్వతుల కల్యాణానికి పుస్తె మెట్టెలు అందజేత

16-02-2026 12:02 AM

మరిపెడ, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ళ ఊకల్ గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య శివపార్వతుల కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి దాత తాడూరి రమేష్ సరస్వతి దంపతులు (లక్ష్మీ సరస్వతి జ్యువలరీ మరిపెడ బంగ్లా) పుస్తెమట్టెలు అందించి

ఆది దంపతుల ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తప్పెట్ల శ్రీను, ఉప సర్పంచ్ బోర మల్లయ్య, భూక్య కాల్య నాయక్, కలంచర్ల చిన్న తిరపయ్య, మట్టపల్లి వెంకటమల్లు, చిత్తలూరి రవి, మామిళ్ళ వెంకన్న, కారింగుల నాగేష్, నందారపు ఉపేందర్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.