calender_icon.png 7 February, 2026 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ కోసం వన దేవతలకు మొక్కులు

01-02-2026 12:00:00 AM

బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్

ముషీరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనకై వన దేవతలైనటువంటి  సమ్మక్క సారమ్మలకు మొక్కులు చెల్లించుకున్నామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ తెలిపారు. ఈ మేరకు శనివారం మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలరాజు గౌడ్ మాట్లాడుతూ  గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారలమ్మల చల్లని దీవెనలతో బహుజనులకు రాజ్యాధికారం రావాలన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధ న ముఖ్య లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని, ఆ దిశగా బహుజనలకు శక్తిని ప్రసాదించాలని అమ్మవార్లను పూజించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్.  దుర్గయ్య గౌడ్,  కన్వీనర్ లు యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్,  అం బాల నారాయణ గౌడ్, బైరు శేఖర్ గంగపుత్ర, సింగం నాగేష్ గౌడ్, బాలగొని వెంక టేష్ గౌడ్, పోతగని ఐలేన్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.