01-02-2026 12:00:00 AM
పాల్గొన్న కలెక్టర్ హరిచందన దాసరి
సికింద్రాబాద్ జనవరి 31 (విజయక్రాంతి): గోల్కొండ తహసీల్దార్ అహల్య విలువైన సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. శనివారం అత్తాపూర్‌లోని హోటల్ కిన్నర గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పాల్గొని 39 సంవత్సరాలు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో గోల్కొండ తహసిల్దార్ అహల్య. పనిచేసి పదవి విరమణ పొందారు. ఆమెను ఘనంగా సన్మానించి, చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ఈ వెంకటాచారి, రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం, వివిధ మండ లాల తహసిల్దార్లు,వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.