5 July, 2026 | 10:41 AM

అధికారులు నిబద్ధతతో పనిచేయాలి

12-06-2024 12:25 AM

సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్, జూన్ 11 (విజయక్రాం తి): అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నారా యణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం ఖేడ్ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వివిధ శాఖలకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఉపాధి పనుల్లో పారదర్శకత ఉండాలని తెలిపారు. కొంతమందికి జీరో బిల్లులు రావడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని, విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున, వైద్యాధికారులు అప్ర మత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం ఐదేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఆయన ఘనం గా సన్మానించారు. ఎంపీపీ చాందీబాయి చౌహన్, జెడ్పీటీసీ లక్ష్మీబాయి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.