5 July, 2026 | 9:33 AM

బిఈడి టిజి ఎడ్‌సెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాదించిన రైతుబిడ్డ

11-06-2024 11:15 PM

నాగర్‌కర్నూల్ : సాధారణ రైతు కుంటుంబంలో పుట్టిన రైతుబిడ్డ ఎం.నవీన్ కుమార్ మంగళవారం వెలువడిన బిఈడి టిజి ఎడ్‌సెట్ ఫలితాల్లో 150కి 118 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాదించారు. బిజినపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి, విజయమ్మ పెద్ద కుమారుడు ప్రాథమిక విధ్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉత్తమ ఫలితాలు సాదించాడని బందువులు తెలిపారు. గ్రూప్ లక్ష్యసాధనలో బిఈడి ఎంట్రెన్స్ రాసినట్లు తెలిపారు. మరింత ప్రపేర్ అయ్యి మున్ముందు మంచి ఫలితాలతో లక్ష్యన్ని చేదిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తమ ర్యాకు సాదించడంపట్ల జిల్వాసులు హర్షం వ్యక్తం చేశారు.