23-02-2026 06:20:42 PM
గుండాల,(విజయక్రాంతి): మండల పర్యటనలో భాగంగా సోమవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు లింగగూడెం గ్రామపంచాయతీలో ఉన్న ప్రధాన సమస్యలను లింగగూడెం సర్పంచ్ చింతా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. గ్రామపంచాయతీలోని పలు ప్రధానమైన పోడుభూమి, సమస్యలు, నూతన సీసీ రోడ్ల నిర్మాణం, మంచినీటి సమస్యలను ఎమ్మెల్యే పాయంకు వివరించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు.