సర్టిఫికెట్ జారీపై విచారణ జరుపుతున్న అధికారులు
మసక బారిన రెవెన్యూ ప్రతిష్ట
కరీంనగర్: ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నిలోజిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో రామాలయం స్థలం నిర్వహణపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. బోయినపల్లి మండలం నీలోజుపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రభుత్వ నిధులు, గ్రామస్తుల భక్తుల విరాళాలతో నిర్మాణం చేసిన రామాలయంపై హక్కుదారుగా కాంగ్రెస్ నేత కుస రవీందర్ కు బోయినపల్లి తాసిల్దార్ నారాయణరెడ్డి సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయమై ఆ గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్ శనివారం రోజున జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా వేములవాడ ఆర్డిఓ ఇతర అధికార దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తాసిల్దార్ కాంగ్రెస్ నేతకు సర్టిఫికెట్ జారీ చేయడం సరైనది కాదని ఆందోళన చేసి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపద్యంలో తప్పుడు సర్టిఫికెట్ జారీ చేసిన తాసిల్దార్ నారాయణరెడ్డి పై, ఒకే రోజున విచారణ జరిపిన ఆర్ ఐ ఫై చర్యలు తీసుకుని జారీ చేసిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలని సర్పంచ్ భాస్కర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ తరుణంలో సోమవారం కూడా వేములవాడ ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్లి సర్పంచ్ భాస్కర్ ఆర్డీవో రాధా బాయ్ తో మాట్లాడి చర్యలు తీసుకోకుంటే గ్రామస్తులు అందరూ సమిష్టిగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నట్లు ఆర్డీవో కు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎలాగైనా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఆయన చెప్పినట్లు చెప్పారు. ఇది ఇలా ఉండగా వేములవాడ ఆర్డీవో మాత్రం సోమవారం సాయంత్రం తాసిల్దార్ నారాయణరెడ్డి ఆర్‌ఐ ని కార్యాలయం పిలిపించి విచారణ జరిపినట్లు విశ్వాసనీయ సమాచారం.
ఈ విషయంలో కేంద్రంలోని ఒక మంత్రి కూడా జిల్లా అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అధికారులకు ఈ విషయం తలనొప్పిగా మారి ఇలా నిర్ణయం తీసుకోవాలో వారు ముందుకు పోలేకపోతున్నట్లు తెలుస్తుంది. కలెక్టర్ కూడా లేకపోవడంతో వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది. కలెక్టర్ వచ్చాక ఈ విషయం కొలిక్కి వస్తున్నట్లు తెలిసింది.
కానీ ఈ విషయం రాజన్న సిరిసిల్ల జి ల్లాలో అన్ని రాజకీయ పార్టీలో, రెవెన్యూ అధికారులు జోరుగా చర్చ సాగుతుంది. సాటి తాసిల్దార్ లు కూడా ఈ విధంగా ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు బహిరంగంగా విచారణ జరిపి ఏది ఉంటే అది ఇస్తే రెవెన్యూ అధికారులకు చేతికి మరక అంటే ఇది కాదని రెవెన్యూ అధికారు లు అంటున్నారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం సర్టిఫికెట్ జారీ చేసి రెవెన్యూ ప్రతిష్టను మ స్కా భారే విధంగా చేసినట్లు అయిందని రెవెన్యూ అధికారులు చర్చించుకుంటున్నారు.




