calender_icon.png 6 October, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చొరవతో రోడ్డు గుంతలు పూడ్చిన అధికారులు

06-10-2025 12:00:00 AM

టేకులపల్లి, అక్టోబర్ 5,(విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ తో టేకులపల్లి మండల కేంద్రం లోని బోడు రోడ్డు కూడలితో పాటు ఇల్లందు - కొత్తగూడెం ప్రధాన రహదారిలో ఏర్పడ్డ గుంత ల మరమ్మతులకు మోక్షం ఏర్పడింది. భారీ వాహనాలు తిరిగి, నిత్యం కురుస్తున్న వర్షాలకు జాతీయ రహదారిపై మోకాలిలోతులో గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇది గుర్తించిన ఎమ్మెల్యే జాతీయ ర హదారుల ఇంజనీరింగ్ అధికారులతో మా ట్లాడి రహదారిపై ఏర్పడ్డ గుంతలనుh పూ డ్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎమ్మె ల్యే ఆదేశంతో సంబంధిత అధికారులు ఆదివారం యంత్రాలను తీసుకొచ్చి పెద్దగా ఏర్ప డ్డ గుంతలను పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. గుంతలు పూడ్చుతుండటంతో ప్ర యాణీకులు, వాహనదారులు చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.