calender_icon.png 6 October, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీర సావర్కర్ దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో నిమజ్జన శోభయాత్ర

06-10-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి అక్టోబర్ 5 ( విజయక్రాంతి ): మీనా నగర్ లోని వీర సావర్కర్ దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. మేళ తాళాలతో భాజా భజన్త్రీలతో డప్పు సప్పులతో కోలాటాలతో స  భజన సంకీర్తనలతో సూపయమానంగా నిమజ్జన యాత్ర జరిగింది.  అమ్మవారి శోభాయాత్రకు మహిళలు పెద్ద ఎత్తున పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అమ్మవారి రథం ముందు ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టి  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ  సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దేవరకొండ నరసింహ చారి, బిజెపి అధ్యక్షులు రత్నాపురం బలరాం, సురేష్ చంద్ర, బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నాపురం బలరాం, బెండ శ్రీకాంత్ ,  భరత్, సుదగాని అఖిల్, తునికి కళ్యాణ్, టెలిమినేటి రాకేష్ కార్తీక్ మణికంఠ బన్నీ దీపక్ తదితరులు పాల్గొన్నారు