17 May, 2026 | 1:19 AM

పెద్ద చెరువును పరిశీలించిన అధికారులు

17-05-2026 12:00 AM

మేడ్చల్, మే 16(విజయక్రాంతి): మేడ్చల్ పెద్ద చెరువును ఇరిగేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శనివారం పరిశీలించారు. చెరువు ఆక్రమణకు గురవుతోందని, కలుషితనీరు చేరుతోందని, ఈ విషయమై జాయింట్ సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు’ శీర్షికన ఈ నెల 13న కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి ఇరిగేషన్ డీఈ జైపాల్‌రెడ్డి, సీఎంసీ, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెరువును పరిశీలించారు.

మ్మెల్యే చామకూర మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల నుంచి వస్తున్న డ్రైనేజీ నీటిని పరిశీలించారు. డ్రైనేజీ నీటి వల్ల చెరువు నీరు కలుషితం కాకుండా తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. సుతా రిగూడెం చెరువును కూడా పరిశీలించారు. వీరి వెంట వర్క్ ఇన్స్‌పెక్టర్ ఇర్షాద్, స్థానిక నాయకులు ఉన్నారు.