17 May, 2026 | 1:18 AM

ఓపెన్ జిమ్ పనులకు శ్రీకారం

17-05-2026 12:00 AM

నాగోల్, మే 16 (విజయక్రాంతి): జీఎస్‌ఐ డివిజన్ పరిధిలోని బండ్లగూడ మహి ళా భవన్ సమీపంలో స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూ. 8 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్ నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. ఈ జిమ్ అందుబాటులోకి వస్తే యువత, మహిళలు, వృద్ధు లు ఉదయం, సాయంత్రం వ్యాయా మం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బండ్లగూడ గ్రామ కమిటీ అధ్యక్షులు చెరుకు భవాని శంకర్ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సహకారంతో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, మహిళలు పాల్గొని ఓపెన్ జిమ్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.