నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యం
ప్రతి యువకుడు ప్రతిభావంతుడు కావాలి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యా రంగానికి పెద్దపీట
మోతె గ్రామంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేష్ షట్కర్
ఎల్లారెడ్డి ఏప్రిల్ :10 (విజయ క్రాంతి) : నిరుద్యోగ నిరుమూలనే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా భావించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో అధునాతన టెక్నాలజీతో నిర్మాణం చేపట్టిన ప్రజా ప్రభుత్వం ఎంతో గర్వకారణంగా, ఉంది నా నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలననే నా లక్ష్యం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా అంతిమ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మోతే గ్రామంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యా రంగ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. లింగంపేట్ మండలం మోతె గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించబడనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ పాఠశాలలో విద్యార్థుల కోసం ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా వసతి గృహాలు (హాస్టల్ సదుపాయం), డిజిటల్ స్మార్ట్ క్లాస్రూమ్స్, సైన్స్ & కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, క్రీడా మైదానాలు, భద్రతా వ్యవస్థలు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ సదుపాయాలతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నగరాల్లో లభించే నాణ్యమైన విద్యను తమ ప్రాంతంలోనే పొందే అవకాశం కలుగుతుంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, ఈ పాఠశాల ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తాం. మోతె గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని 8 మండలాల విద్యార్థులకు సులభంగా చేరుకునే విధంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ , ఎమ్మెల్సీ అంజిరెడ్డి ,జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆలే మల్లికార్జున్ , లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నారా గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీలత సంతోష్ రెడ్డి ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ జొన్నలగడ్డ రాజు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, , కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




