13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అధికారులు సమన్వయంతో పని చేయాలి

26-03-2026 01:39 AM

ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ 

శంకర్ పల్లి; మార్చి 25.(విజయక్రాంతి): అధికారులు సమన్వయంతో పని చేయాలని శంకర్ పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ సూచించారు బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకయ్య ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సర్పంచులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన అంశాలను చర్చించారు. అలాగే పారిశుద్ధ్య పనులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్తగా ఇందిర ఇండ్ల మంజూరి, పూర్తి అయిన ఇద్దరమ్మాయిలకు సంబంధించిన వివరాలపై చర్చించారు. గ్రామాలలో నిర్వహిస్తున్న నర్సీరీలను సక్రమంగా నిర్వహించాలని, వాటికి వారంలో రెండు మూడు సార్లు నీరు పట్టాలని ఎంపీడీవో సూచించారు. ఇంటి పనులు విషయంలో సమీక్ష సమావేశం జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిరాజు, సూపరిండెంట్ గోపాలకృష్ణ, హౌసింగ్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.