13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

26-03-2026 01:37 AM

ఆమనగల్లు, మార్చి 25(విజయక్రాంతి): ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఘన విజయం సాధించిన వేం నరేందర్ రెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం నియోజకవర్గ పరి ధిలోని పలు అంశాలపై వారు చర్చించారు. కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల సాధనకు తన వంతు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఎంపీని కోరారు. దీనికి స్పందించిన వేం నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ప్రగతికి సాధ్యమైనంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.