ఆర్టీఐ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు
ఆరు నెలలు గడుస్తున్న సమాధానం ఇవ్వని వైనం
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 19: సమాచార హక్కు చట్టానికి రెవెన్యూ అధికారులు నిర్లక్షం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ మండలానిక చెందిన సూర్య శ్రీనివాస్‌రెడ్డి అన్మగల్ హయత్‌నగర్ పరిధి సర్వే నెంబర్ 141, 139, 136లకు సంబంధించిన భూ కన్వర్షన్ చేసినట్లు అయితే.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద గత సంవత్సరం (24102025)లో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్టీఐ కింద సమాచారమిస్తే ప్రభుత్వానికి ఏమైనా రుసుం చెల్లించాల్సి వస్తే తప్పకుండా చెల్లిస్తానని దరఖాస్తుల్లో కుప్లంగా పేర్కొన్నారు.
ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన కన్వర్షన్, పర్మిషన్ల ఇచ్చినట్లు అయితే వాటిని సంబంధించిన పత్రాలను ఇవ్వగలరని అధికారులు కోరగా.. ఇప్పటి వరకు ఇవ్వకుండా రేపు.. మాపు... అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్డీవో ఆఫీసులో రెవెన్యూ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఆఫీసర్లు ఎందుకు సమాచారమివ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు.






