18 March, 2026 | 2:17 AM

తాగునీటిపై అధికారుల అప్రమత్తం

18-03-2026 12:31 AM

కుబీర్, మార్చి ౧7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎండలు, ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటుతు న్నాయి. నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇటీవలే ప్రజా పాలన అవగాహన సదస్సులో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, పలువురు సర్పంచులు తమ గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రాక కరెంటు కోతల వల్ల తాగునీటికి కటకట ఏర్పడుతుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నిర్మల్ జిల్లాలో 18 మండలా లు 400 గ్రామపంచాయతీలో ఉండగా 610 ఆవాసాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు ఈ గ్రామాలకు స్వచ్ఛమై న శుద్ధ జలం సరఫరా చేస్తున్నారు. భైంసా డివిజన్లోని బైంసా కుంటాల తానూర్ కుబీర్ ముధోల్ ప్రాంతాలకు బైంసా, గడ్డన్న వాగు నుండి మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నిర్మల్ డివిజన్లోని మాడేగాం ఫిల్టర్ బెడ్ నుంచి నిర్మల్ దిల్వార్పూర్ సారంగాపూర్  మామడ నిర్మల్ రూలర్ మండలా లకు, పాక్ పట్ల గాంధీనగర్ నుంచి లక్ష్మణ చందా సోన్ మండలలకు కడెం ప్రాజెక్టు నుంచి కడెం దస్తురాబాద్ పెంబి ఖానాపూర్ మండలాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు.

అయితే వేసవికాలం కావడంతో నీటి సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడడంలో వోల్టేజీ కారణంగా ఆటంకాలు ఏర్ప డుతున్నాయి. ఈ నేపథ్యంలో  నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి తలెత్తకుండా కుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో డీలు ఏఈలు ప్రతిరోజూ నీటి సరఫరా జరగాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు గ్రామాల్లో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లకు నీటి సరఫరా చేసేందుకు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.