calender_icon.png 17 January, 2026 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా రైతుకు రైతు రత్న అవార్డు అందించిన అధికారులు

17-01-2026 04:02:03 PM

గుడిహత్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అందించే రైతు రత్న అవార్డుకు జిల్లా రైతు ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్ లో మహా కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లా నుండి అధునాతన పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతులను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగానే గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన రైతు కేంద్రే వెంకట్రావు తన 15 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నాడు.

దీంతో ఆయన్ని రైతు రత్న అవార్డు 2025 కు ఎంపిక చేయడం జరిగింది. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉత్తమ రైతు పురస్కారాన్ని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి చేతుల మీదుగా అవార్డు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భగత్ రమేష్, కోశాధికారి రవీందర్, వ్యవసాయ సహాయ సంచాలకులు శివకుమార్, అధికారులు అష్రఫ్ అహ్మద్, శ్రీనివాస్ రెడ్డి, బోరిగాం రైతు గంగారెడ్డి పాల్గొన్నారు.