17-01-2026 03:52:27 PM
చైర్మన్ స్థానం మహిళా జనరల్
- ఆశల గల్లంతు
- తలలు పట్టుకున్న నేతలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ వార్డు, చైర్మన్తో సహా అన్ని స్థానాల రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ రిజర్వేషన్లు పాత రిజర్వేషన్లు తలకిందులు చేశాయి. 34వార్డుల రిజర్వేషన్లలో మెజార్టీగా స్థానాలు తలకిందులయ్యాయి. 12వార్డు ఎస్టీ జనరల్, ఎస్సీ 10, బీసీ 6, వార్డులు, 17 వార్డులను జనరల్ కి కేటాయించారు. ఈ రిజర్వేషన్లు ఆశావహుల లను ఒక్కసారిగా నిరాశపర్చాయి. మళ్ళీ ఆలోచలో పడేశాయి.
ఈ రిజర్వేషన్లు వారి రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పవచ్చు. పక్క వార్డుల పై దృష్టి పెట్టాలల్సిన పరిస్థితీ దాపరించింది. అదికూడా లాభిస్తాదనే గ్యారంటీ లేదు. ఒక్కసారిగా అంతాఆగమ్య గోచరంలో పడిపోయారు. గతం చైర్మన్ పీఠం ఎస్సీ మహిళ ఉండ గా మారిన రిజర్వేషన్ ప్రకారం బిసి మహిళా జనరల్ అయింది. దాదాపు అన్ని స్థానాల రిజర్వేషన్లు మార్చారు.
- వార్డుల వారీగా మారిన రిజర్వేషన్లు..
వార్డు నెం. 1 ఎస్సీ (డబ్ల్యూ), వార్డు నెం.2, ఎస్సీ (జి),వార్డు నెం.3,యుఆర్ (డబ్ల్యూ),వార్డు నెం.4,ఎస్సీ (డబ్ల్యు),వార్డు నెం.5,యుఆర్ (జీ),వార్డు నెం.6,యుఆర్ (డబ్ల్యూ),వార్డు నెం.7,యుఆర్ (జీ), వార్డునెం.8,యుఆర్ (జీ),వార్డు నెం.9,ఎస్సీ (జీ),వార్డు నెం. 10, బీసీ (డబ్ల్యూ),వార్డు నెం.11,యుఆర్ (డబ్ల్యూ), వార్డు నెం.12,ఎస్టీ (జీ), వార్డు నెం.13, బీసీ (జీ), వార్డు నెం.14, ఎస్సీ (జీ), వార్డు, నెం.15, యుఆర్ (డబ్ల్యూ), వార్డు నెం.16 బిసి (జీ),వార్డు నెం.17, బీసీ (జీ), వార్డు నెం.18 బీసీ (డబ్ల్యూ), వార్డు నెం.19, యుఆర్ (డబ్ల్యూ), వార్డు నెం.20, యుఆర్ (జీ), వార్డు నెం.21 యుఆర్జీ, (జి), వార్డు నెం.22, ఎస్సీ (డబ్ల్యూ),
వార్డు నెం.23, ఎస్సీ (డబ్ల్యూ), వార్డు నెం.24 ఎస్సీ (డబ్ల్యూ), వార్డు నెం.25, యుఆర్ (డబ్ల్యు), వార్డు నెం.26, ఎస్సీ (జీ), వార్డు నెం.27, ఎస్సీ (జీ), వార్డు నెం.28, యుఆర్ (జీ), వార్డు నెం.29, యుఆర్ (జీ), వార్డు నెం.30, బీసీ (డబ్ల్యూ), వార్డు నెం.31, యుఆర్ (డబ్ల్యూ), వార్డు నెం.32,యుఆర్ (డబ్ల్యూ), వార్డు నెం.33, యుఆర్ (డబ్ల్యూ), వార్డు నెం.34, యుఆర్ (జీ) ఉన్నాయి. ఇదిలా ఉండగా రిజర్వేషన్ల పై వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఆశావహులు, మాజీ కౌన్సిలర్ల రిజర్వేషన్లు తీరుపై మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.