15-02-2026 07:38:41 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని మోతేగడ్డ శ్రీ వీరభద్ర స్వామిని మహా శివరాత్రి సందర్భంగా ఐటిడిఏ పీవో బి రాహుల్ దంపతులు, సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చక స్వాములు పిఓ దంపతుల చేత పాలాభిషేకాలు చేయించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చక స్వాములు స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం పిఓ రాహుల్, సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట ఆలయ పరిసరాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అతి పేరెన్నికగన్న గోదావరి నది మధ్యలో ఉన్న మోతే గడ్డ వీరభద్ర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఈ దేవస్థానమును అభివృద్ధి పరిచి ప్రతినిత్యం భక్తులు వచ్చే స్వామివారిని దర్శించుకునేలా సంబంధిత అధికారులు కృషిచేయాలని, ఈ దేవాలయము పర్యాటకులకు సరదాగా విహరించడానికి చాలా అనుకూలంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కెఆర్ కెవి ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, ఎంపీవో బాలయ్య, డిటి సమ్మయ్య, ఆర్ఐ వీర్రాజు,దేవస్థానం ఈవో కృష్ణ, వీరభద్ర స్వామి దేవస్థానం పూజారులు తదితరులు పాల్గొన్నారు.