calender_icon.png 16 February, 2026 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుల ఔదార్యం.. తల్లి బిడ్డలకు క్షేమం

16-02-2026 12:00:00 AM

నిర్మల్ ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నాలం స్వప్న శశికాంత్ భక్తుల పట్ల ఉదారత చాటుకున్నారు. దిల్వార్పూర్ మండలం కదిలి అన్నపూర్ణ ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు తల్లి బిడ్డలకు పాలిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేశారు.

చిన్నపిల్లలకు పాలిచ్చేందుకు తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న వైద్యులు సుమారు లక్ష రూపాయలతో పాలిచ్చే విడిది గదులను స్వచ్ఛందంగా ఏర్పా టు చేసి తమ ఉదారతను చాటుకున్నారు. వైద్యులను పూజారులు పంచాక్షరి శంకర్ ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు, భక్తులు అభినందించారు.