5 July, 2026 | 2:28 AM

ఓ..! సుకుమారి ప్రేమిస్తున్నా..

05-07-2026 12:15 AM

తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన విలేజ్ ఎంటర్‌టైనర్ ‘ఓ.! సుకుమారి’.  భరత్ దర్శన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. జూలై 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘ప్రేమ.. ప్రేమిస్తున్నా’ అనే రొమాంటిక్, మెలోడీ పాటను విడుదల చేశారు మేకర్స్.

భరత్ మంచిరాజు సంగీతం సమకూర్చిన ఈ పాటను పూర్ణాచారి రాయగా, జేమ్స్ టకారా ఆలపించారు. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమా టోగ్రఫీ చేసిన సీహెచ్ కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎంఎం కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తున్నారు. బలగం ఫేం తిరుమల ఎం తిరుపతి ఆర్ట్ డైరెక్టర్, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌ఎడిటర్.