666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ స్పై డ్రామా
05-07-2026 12:18 AM
కరునాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో వైశాక్ జే గౌడ నిర్మిస్తున్న ఈ సినిమాలో డాలీ ధనంజయ, ప్రియాంక మోహన్, అదితి బాలన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అద్వైత గురుమూర్తి డీవోపీ కాగా, చరణ్ రాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీన్ని చూస్తే.. ఈ చిత్రాన్ని స్పై డ్రామాగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే, శివరాజ్‌కుమార్ ‘సీఐడీ999’ను గుర్తుచేస్తోందీ టీజర్. శివరాజ్ కుమార్ ఇందులో ఏజెంట్ ప్రకాశ్‌గా ఫైర్ పుట్టించే ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు.






