4 July, 2026 | 12:57 AM

ఇరుముడిలో స్పెషల్ స్టెప్పులు!

04-07-2026 12:00 AM

మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీ గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కమర్షియల్ హంగులకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఈ పాట కోసం యంగ్ బ్యూటీ నభా నటేశ్‌ను చిత్రబృందం సంప్రదించిందని టాక్. నభా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఈ పాటలో రవితేజతో కలిసి స్టెప్పులు వేయనుందని, అయితే ఈ ప్రత్యేక గీతంలోనే కాక ఈ ముద్దుగుమ్మ ఇందులో ఓ అతిథి పాత్రలోనూ అలరించనుందని సమాచారం. రవితేజ, నభా మధ్య కథలో భాగంగా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయట.

దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రవితేజ మార్క్ ఎనర్జీకి, శివ నిర్వాణ మార్క్ సెంటిమెంట్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇదిలావుంటే, నభా నటించిన ‘నాగబంధం’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇందులో నభా పోషించిన పార్వతి పాత్ర అలరిస్తోంది. నభా నటేశ్ నటించిన ‘స్వయంభూ’ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది.