చిలకా ఇటు వాలావా..
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘తెల్ల కాగితం’. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. రమేశ్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రచయిత నందు సవిరిగన కథను అందిస్తూ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను రాశారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘చిలకా’ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో.. రెక్కలే వచ్చెనీ వేళా.. ఎదలో ఈ పరుగేంటో.. నాలో ఈ గొడవేంటో.. ఏమో ఏం జరిగిందో..
కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూశాయేమో.. అడుగే తడబడెనోంటో.. కాలం ఆగడమేంటో.. అయినా బాగుందేంటో.. రెండూ జడలేసి సీతాకోకా.. ముందే నడిచెళితే పాదం కదిలే తన వెనకే.. చిలకా ఇటు వాలావా చిగురించే కొమ్మల్లో.. చినుకా నువు రాలావా ఎవరూ లేని హృదయంలో..’ అంటూ సాగుతోందీ గీతం. విజయ్ బుల్గానిన్ బాణీ కూర్చిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రానికి కేవీ గుహన్ కెమెరామెన్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.






