calender_icon.png 11 September, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాత్కాలిక మరమ్మతులకు ఓకే!

11-09-2025 01:43:51 AM

  1. పనులకు వరద నిధులు మంజూరు 
  2. ముమ్మరంగా రోడ్డు గండ్ల పూడ్చివేతలు
  3. కల్వర్టు పనుల జోరు

కామారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి), ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన విషయం విధితమే. భారీ వర్షాలు, వరదలకు ప్రధాన రహదారులు గండ్లు పడడమే కాకుండా, కల్వర్టులు దెబ్బతిని రాకపోకలకు పలుచోట్ల అంతరాయం ఏర్పడడమే కాకుండా బస్సులు, వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు తాత్కాలిక మరమతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఫ్లడ్ నిధులు మంజూరు చేశారు.

అత్యవసర రోడ్లు, కల్వ ర్టుల మరమ్మతులకు ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాల జాల్ చేశారు. ప్రత్యేక నిధులను విడుదల చేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులను తొలగించాలని పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మరమ్మతుల పనులు జోరుగా సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద పాత ఏడవ నెంబర్ జాతీయ రహదారి కల్వర్టు వద్ద గుంతలు ఏర్పాటు కాకుండా ప్రధాన రహదారిపై రోడ్డు కొట్టుకుపోయి గుంతలు గా మారాయి.

వరదలు తగ్గడంతోనే వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఏర్పాట్లు పూర్తి చేశారు. కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారిపై గండ్లు పడిన రోడ్లను, కల్వర్ట్లువద్ద తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహనాలు వెళ్లే విధంగా ప్రయాణాలు సాగే విధంగా పనులు పూర్తి చేశారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి రహదారిలో నిలిచిపోయిన వాహనాలను పునరుద్ధరించారు. దోమకొండ, బీబీపేట రహదారి వరదల వల్ల బిబిపేట వద్ద బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకపోయింది.దీంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

ప్రస్తుతం వాహనాలు వెళ్ళే విధంగా తాత్కాలిక రోడ్డు మరమ్మతులు పూర్తి చేశారు. కామారెడ్డి మాచారెడ్డి రహదారిపై ఉగ్రవాయి, క్యాసం పల్లి వద్ద వరదలకు రోడ్డు కొట్టకపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. మొరం పోసి తాత్కాలికంగా రోడ్డు క్లియర్ చేశారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గం లోని పలు రోడ్లు తాత్కాలిక మరమ్మ తులు చేపట్టారు. 

నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అచ్చంపేట వద్ద రోడ్డు మరమ్మత్తులు చేపట్టలేదు. వరద నీటికి రోడ్లు మూడు చోట్ల కోట్టుకపోయా యి. ఇంతవరకు అక్కడ తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో అచ్చంపే ట తో పాటు మరో రెండు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మద్నూర్, డోంగ్లి మండలాల్లో సైతం రోడ్లు గండ్లు పడి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సంబంధిత పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దృష్టికి తెచ్చి తాత్కాలిక మరమ్మతుల కోసం నిధు లు విడుదల చేయాలని కోరారు. బాన్సువా డ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో భారీ వర్షాల వల్ల వరదల వల్ల చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. వందల కోట్ల విలువ గల రోడ్లు, కల్వర్టులు పనికి రాకుం డా పోయాయి. వాటి నిర్మాణాలకు చాలా రోజులు పడటమే కాకుండా అధిక నిధులు మంజూరు కావాల్సి ఉంది.

ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాహనదారులకు రాకపోకలు జరిగే విధంగా తాత్కాలిక మరమ్మత్తులు జోరుగా సాగుతు న్నాయి. దీంతో ప్రజలు తాత్కాలిక మనమతులు జరుగుతుం డడంతో రవాణా సౌకర్యాలు ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్నామని ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికారులు సైతం వెంట వెంటనే మరమ్మత్తుల పనులు చేపట్టడమే కాకుండా పర్యవేక్షించి పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు.

అధిక వర్షాలతో దెబ్బతిన్న జనగామ, మాందాపూర్ రోడ్డు పునరుద్ధరణ పనులు బుధవారం చేపట్టారు. జనగామ మర్రి నుండి మాందాపూర్ వరకు ఆర్ అండ్ బి రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. రహదారిపై భాగం కొట్టుకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డిఆర్‌ఎఫ్ నిధుల నుంచి పది లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో రహదారి మరమత్తుల పనులు వేగంగా నిర్వహిస్తున్నట్లు ఆర్ అండ్ బి ఈ మోహన్ రెడ్డి తెలిపారు. 

రాబోయే రోజుల్లో రహదారి పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా  చర్యలను చేపట్టనున్నట్లు ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు.  మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి నుండి జనగామ మర్రి వరకు రోడ్డు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.పాల్వంచ మర్రి నుండి జ&జనగామ మరి వరకు నా రండి రాదారి ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా దెబ్బతింది.

ముఖ్యంగా రోడ్డు కిరువైపులా ఉన్న మొరం కొట్టుకపోవడంతో రహదారి బలహీనమైంది. వాహన రాకపోవకుల కూతురు ఇబ్బందులు  తలెత్తాయి. ఈ పరిస్థితిని గమనించి జిల్లా కలెక్టర్ 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ ఈ నిధులతో రహదారి మరమత్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో రహదారిని పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలకు అనుకూలంగా మార్చే చర్యలు అధికారులు చేపడుతున్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం బీర్పూర్ తండా నుండి తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం కు వెళ్లే దారిలో అధిక వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్డుకు లక్ష ఇరవై వేల రూపాయలతో మరమతి పనులు చేపట్టారు.

ఇదే రహదారిపై ఆరు కలవట్లేదు నిర్మించేందుకు 20 లక్షల రూపాయలు మంజూడై దాంట్లో పనులు ప్రారంభిస్తున్నామని బాన్సువాడ పంచాయతీరాజ్ శాఖ ఈఈ అంజనేయులు తెలిపా రు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి రహదారిపై దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారిపై లింగంపేట మండలంలో దెబ్బతిన్న కల్వర్టుల, రోడ్లు మరమ్మతుపనులు సాగుతున్నాయి.

తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాం 

కామారెడ్డి జిల్లాలో ఆర్ అండ్ బి రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపడుతున్నాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో తాత్కాలిక మరమ్మత్తులు చేపడుతున్నాం. రహదారులు దెబ్బతిన్న వివరాలను ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి నివేదికలు  పంపినాము. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరైన తర్వాత టెండర్ వేసి పనులు ప్రారంభిస్తాం.

- మోహన్‌రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ, కామారెడ్డి