calender_icon.png 19 February, 2026 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలు ఆత్మహత్య

28-10-2025 12:00:00 AM

తాడ్వాయి, అక్టోబర్, 27( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో  ఆదివారం రాత్రి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు తాడువాయి ఎస్త్స్ర నరేష్ తెలిపారు. ఎస్త్స్ర తెలిపిన వివరాల ప్రకారం... ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన జంగల్ దేమి రాజవ్వ (77) అనే వృద్దురాలు ఆదివారం రాత్రి రెండవ కుమారుడు అయిన రాజిరెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయారు.

రాజిరెడ్డి సోమవారం ఉదయం ఇంట్లో చూడగా రాజవ్వ కనబడలేదు.వెంటనే అనుమానం వచ్చి ఇంటికి సమీపంలో వెతుకుతున్న క్రమంలో భావి వద్ద రాజవ్వ చేతి కర్ర కనిపించింది.అనుమానంతో బావి వద్దకు వెళ్లి చూడగా రాజవ్వ బావిలో దూకి మరణించి ఉన్నట్లు గుర్తించారు.

మృతురాలు గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుమారులు తెలిపారు. ఈ బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆయన తెలిపారు. మృతురాలికి నలుగురు కుమారులు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర వివరించారు