28-10-2025 12:00:00 AM
 
							హనుమకొండ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఎంజీఎం హాస్పిటల్ పై ఎందుకంత నిర్లక్ష్యమని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రశ్నించారు. ఇటీవల ఎంజీఎం పిల్లల వార్డులో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక ఇద్దరు పిల్లలకి ఒకే సిలిండర్ ను అమర్చి తీసుకువెళ్లేటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలైన విషయం తెలిసిందే దీనినీ దృష్టిలో ఉంచుకొని ఎంజీఎం పరిపాల తీరు పై శేషు మండిపడ్డారు.
సుబేదారి ఆరట్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శేషు మాట్లాడుతూ పేద ప్రజలకి వైద్య సేవలు అందించే ఎంజీఎం హాస్పి టల్‌లో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కథనాలు సామాజిక మాధ్య మాలలో వస్తున్నా కూడా ప్రభు త్వం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.
ఎంజీఎంలో వైద్య సదుపాయాల పైన డాక్టర్ల కొరత పైన అవినీతిపైన అనేక సందర్భాలలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం చూస్తుంటే ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి లేనట్లుగా కనపడుతుంది అన్నా రు. గతంలో డాక్టర్ చంద్రశేఖర్ ఎంజిఎం సూపరిండెంట్‌గా హాస్పటల్‌ని చెక్కదిద్దే ప్రయత్నం చేస్తే,తనని రాజకీయ ఒత్తిడితో బదిలీ చేసిన తర్వాత ఎంజీఎం పరిస్థితి మరింత అద్వానంగా తయారైందని విమర్శించారు.
ఎంజీఎం హాస్పిటల్ లోనే సరైన వైద్య సదుపాయాలు అందించలేని ప్రభుత్వం హాస్పటల్ ని నిర్వహించలేని వారు భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకి వైద్య సేవ లు ఎలా అందిస్తారనే అనుమానాలు కలుగుతున్నాయని అభిప్రా యపడినారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎంజీఎం లో పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేసినారు. ధారబోయిన సతీష్, ఎర్ర బొజ్జు రమేష్ పాల్గొన్నారు.