calender_icon.png 17 June, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒలంపిక్ డే రన్

17-06-2025 06:58:10 PM

క్రీడా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలి..

జిల్లా ఒలంపిక్ రన్ కన్వీనర్ కరుణాకర్ రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒలంపిక్ డే రన్(Olympic Day Run)-2025 కమిటీ ఆధ్వర్యంలో ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ(Olympic Association State Committee) ఆదేశాల మేరకు ఈనెల 19వ తేదీన, 39వ ఒలంపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్ రన్ కన్వీనర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మంగళవారం కామారెడ్డిలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు కమిటీ సభ్యులు, వ్యాయామ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా పోషకులు, వాకర్స్ అసోసియేషన్, తదితర సంఘాలు అందరూ పాల్గొని ఈ ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయాలని ఒలంపిక్ రన్ కన్వీనర్ నల్లవెల్లి కరుణాకర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.