15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

క్రీడాస్ఫూర్తికి ప్రతీక ఒలింపిక్ రన్

24-06-2025 12:00 AM

- గూడెంలో ముగిసిన ఒలింపిక్ రన్

- ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ జీవి పాటిల్, ఒలంపిక్ చీఫ్ ప్యాట్రన్ నాగా సీతారాములు

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 23 (విజయక్రాంతి); జిల్లా యూత్ అండ్ స్పోర ట్స్ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేష న్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు నిర్వహించిన 2025 ఒలంపిక్ డే రన్ సంద ర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఒలంపిక్ చీఫ్ ప్యాట్రన్ నాగా సీతారాములు, డి వై ఎస్ ఓ పరంధామ రెడ్డి ప్రారంభించారు.

ఈ సం దర్బంగా వారు మాట్లాడుతు గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధా న్యం ఇస్తుందన్నారు. జి ల్లాలో క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేయడమే కాక నూతన స్టేడియంలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. క్రీడలకు పుట్టినిల్లైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఎందరో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని చెప్పారు.

ఇదే పరంపరను యు వత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ చీఫ్ ప్యాట్రన్ సాబీర్ పా షా,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల.శ్రీనివాసరావు,ఒలంపిక్ జిల్లా చైర్మన్ కే మహిధర్, ప్రెసిడెంట్ యుగంధర్ రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రెటరీరాజేంద్రప్రసాద్, అధికారులు, అనధికారులు, వివిధ క్రీడల కోచ్ లు,క్రీడాకారులు పాల్గొన్నారు.