calender_icon.png 19 June, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా సెట్‌లో..

18-06-2025 12:04:13 AM

చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మేకింగ్ టైటిల్ ‘మెగా157’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాను షైన్‌స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.

ఇందులో చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార మంగళవారం ముస్సోరీలో షూటింగ్‌లో పాల్గొన్నారు. చిరంజీవి వింటేజ్ అవతార్‌లో కనిపించనున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయను న్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: సమీర్‌రెడ్డి; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.