calender_icon.png 10 July, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్ల్లుమాక్స్ వరకూ ఉత్కంఠగా..

18-06-2025 12:03:02 AM

రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది.

టీమ్ త్వరలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. “మిస్టీరియస్ చిత్రాన్ని ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా రూపొందించాం.

ఈ చిత్రం క్రమక్రమంగా క్లూస్‌ను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా ఉంచుతుంది. షాకింగ్ ట్విస్టులు కథను కొత్త ఎత్తులకు తీసుకెళ్లి వీక్షకులను రంజింపజేస్తుంది. యాక్ష న్స్, థ్రిల్లింగ్ ప్రేక్షకులకు కట్టిపడేస్తాయి” అని తెలిపారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. ‘క్ల్లుమాక్స్ వర కు ఉత్కంఠను నింపడం ఈ చిత్రం మాస్టర్ క్లాస్. ఎక్క డా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.