calender_icon.png 29 July, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కడికక్కడే తీర్పులు, పరిష్కార ఆదేశాలు

29-07-2025 02:43:13 AM

ప్రారంభమైన మానవ హక్కుల కమిషన్ బహిరంగ విచారణ       

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ప్రభుత్వాధికారుల ఫిర్యాదుల పరిష్కారం, పనితీరులో జవాబుదారీతనం నిర్ధారణే లక్ష్యంగా రెండు రోజుల పాటు జరిగే జాతీ య మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) బహిరంగ విచారణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదులు, కేసులను పరిశీలించడానికి హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో రెండు డివిజన్ బెంచ్ లు విచారణ నిర్వహించాయి.

డివిజన్ బెంచ్ ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్ జస్టిస్ రామసుబ్రమణియన్, డివిజన్ బెం-చ్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని అధ్యక్షత వహించారు. ముఖ్యమైన ప్రజాప్రాము ఖ్యం కలిగిన వాటిని ఎంపిక చేసిన కేసులను విచారించడానికి పూర్తి బెంచ్ ఏర్పాటు చేశా రు. వీటిలో ఎక్కువగా కమిషన్ తీసుకున్న సుమోటో కేసులు ఉంటాయి.

వీటిలో కుల ఆధారిత వివక్ష, సామాజిక బహిష్కరణ, కస్టోడియల్, పోలీసుల మితిమీరిన చర్యలు, జీవించే హక్కు, గౌరవం, స్వేచ్ఛ, జీవనోపాధి ఉల్లంఘనలకు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. దృష్టికి వచ్చిన ఉల్లంఘనలపై కమిషన్ బాధితులకు తగిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. మంగళవారం ఈ కార్యక్రమం ముగియనున్నది. ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు రాష్ర్ట సీనియర్ అధికారులతో సమావేశం అవుతారు. కార్యక్ర మానికి హాజరైన చైర్‌పర్సన్, కమిషన్ సభ్యులకు సీఎస్ రామకృష్ణారావు స్వాగతం పలికారు.