20 June, 2026 | 2:37 AM

‘ఒకే సిటీ, ఒకే విజన్, అపార అవకాశాలు’

20-06-2026 01:04 AM
  1. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  2. ఖాజాగూడలోని ఎస్‌ఏఎస్ ఐటీ టవర్‌లో ‘హైదరాబాద్ ఎకనామిక్ ఫోరమ్ 2026’ 

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): నిజాయతీతో కూడిన ఆలోచనలకు మద్దతు అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఖాజాగూడలోని ఎస్‌ఏఎస్ ఐటీ టవర్లో మొట్టమొదటి ‘హైదరాబాద్ ఎకనామిక్ ఫోరమ్ 2026’ నిర్వ హించారు. ‘ఒకే సిటీ, ఒకే విజన్, అపార అవకాశాలు’ అనే నినాదంతో ఈ సదస్సు జరి గింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘సరికొత్త ఆలోచనలతో తెలంగాణకు రండి. ప్రతి ఆలోచన విజయవంతమవుతుందని గ్యారెంటీ ఇవ్వలేకపోవ చ్చు, కానీ నిజాయితీతో కూడిన ప్రతి ఆలోచనకు ఇక్కడ మద్దతు, అవకాశం, ఎదిగేందు కు కావాల్సిన నమ్మకం లభిస్తాయని హామీ ఇవ్వగలం’ అని చెప్పారు.

గత దశాబ్ద కాలం లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం 81వ స్థానం నుంచి 39వ స్థానానికి చే రడం, అద్భుతమైన వృద్ధిని సాధించడం ఈ ప్రపంచ మార్పును ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్స్’లో తెలంగాణ అత్యంత డైనమిక్ ఇన్నోవేషన్ హబ్‌లలో ఒకటిగా అవతరించిందన్నారు. ‘టాప్ పెర్ఫార్మర్’గా గుర్తింపు పొందిందని తెలిపారు.

ఐకామ్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, స్టార్టప్‌ల కోసం రూ.1,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్, ప్రతిపాదిత ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, 100 అడ్వాన్స్‌డ్ ఐటీఐల వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించ డమే కాకుండా, వాటికి అవసరమైన వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. ఏఐ-ఎనేబు ల్డ్ తరగతి గదులు, ఏఐ లిటరసీ మిషన్ ద్వారా భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమై న నైపుణ్యాలతో దాదాపు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇరవై లక్షల మంది విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా చైర్మన్ డాక్టర్ జీవీ రావు మాట్లాడుతూ.. సాంకేతికత, లైఫ్ సెన్సై స్, రిటైల్, రియల్ ఎస్టేట్, క్రీడలు, వినోదం వంటి పలు రంగాలలో ఏకకాలంలో రాణించగల సామర్థ్యం హైదరాబాద్‌కు ఉండటమే అసలైన బలమన్నారు. ఈ సదస్సుకు ఐదు వందల మందికి పైగా వ్యాపార ప్రముఖులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారు లు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.  ‘హైదరాబాద్: భారతదేశ ఆవిష్కరణల రాజధా నిగా ఎదుగుదల’ అనే అంశంపై చర్చించారు.

ఎకనామిక్ రీసెర్చ్, గ్లోబల్ అడ్వుజరీ, పాలసీ ఇంటెలిజెన్స్ అంశాల ఆధారంగా ఈ ఫోరమ్ నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గ మౌలిక సదుపాయా లు, డిజిటల్, ఏఐ పరివర్తన, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఆవిష్కరణలు, పారిశ్రామికవే త్తలు, పెట్టుబడులు, మూలధనం వంటి అం శాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. వీటి తో పాటు లైఫ్ సెన్సైస్, రిటైల్, రియల్ ఎస్టే ట్, వెల్త్ మేనేజ్‌దీతిజిజిమెంట్, విద్య, హాస్పిటాలిటీ,  వంటి విభిన్న రంగాలపై కూడా ప్రత్యేక సెషన్లు జరిగాయి. ఇది నగరం బహుముఖ వృద్ధి పథాన్ని ప్రతిబింబించింది. నాలెడ్జ్ పార్టనర్ ‘బోవర్ స్కూ ల్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్’ సహకారంతో ‘ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

సదస్సులో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ ప్రీతిరెడ్డి, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సతీష్ దువా, లైఫ్ సెన్సైస్ ఫార్మా సీఈఓ సర్వేష్ సింగ్, నెక్స్ట్ వేవ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రా హుల్ అత్తులూరి, లామ్‌కాన్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ లాంబా, 360డీ స్పోర్ట్స్ ఫౌండింగ్ పార్ట్నర్ కార్తీక్ యనమండ్ర, ఏషియన్ సినిమాస్ వ్యవస్థాపకుడు సునీల్ నారంగ్, ఆక్సిమోరా న్స్ హాఫ్-ఎ-బావా హాస్పిటాలిటీ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకుడు రెహాన్ గుహా, మృణాళిని రావు లగ్జరీ ఫ్యాషన్ లేబుల్ వ్యవస్థాపకురాలు క్రియేటివ్ డైరెక్టర్ మృణాళిని రావు పాల్గొన్నారు. ‘బీట్రూట్ న్యూస్’ వ్యవస్థాపకురాలు ఫే డిసౌజా కొన్ని సెషన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.