5 July, 2026 | 2:24 AM

ప్రతి ఐదు బూత్‌లకు ఒక కో ఆర్డినేటర్

05-07-2026 12:00 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూలై 4 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటరు జాబితా సమగ్ర సర్వేపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యా దవ్ పాల్గొని బూత్ స్థాయి కార్యకలాపాలపై పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. నియోజకవర్గంలో పార్టీని, ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి బలంగా తీసుకెళ్లేలా ప్రతి ఐదు బూత్లకు ఒక కో-ఆర్డినేటర్ను నియమించినట్లు ఆయన తెలిపారు.ప్రతి డివిజన్లో పనిచేస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్ల సమన్వయం కోసం ఈ కో-ఆర్డినేటర్లకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ల తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న దరఖాస్తు ఫారమ్లను నింపడంలో వారికి సహాయం చేయాలని ఆదే శించారు. ప్రజలకు పంపిణీ చేసిన దరఖాస్తు ఫారమ్లలో ఎన్ని నింపించాం, ఎన్ని తిరిగి సేకరించామనే ఖచ్చితమైన వివరాలను సంబంధిత కో-ఆర్డినేటర్లకు అందజేయాలని సూచించారు. కో -ఆర్డినేటర్లు సైతం బీఎల్ ఏల పనితీరును పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.