5 July, 2026 | 2:25 AM

1970 గజాల పార్కును కాపాడిన హైడ్రా

05-07-2026 12:00 AM
  1. రూ.20 కోట్ల విలువైన  భూమికి హైడ్రా ఫెన్సింగ్
  2. రాజకీయ నాయకుల కబ్జాలో ఉన్న స్థలానికి విముక్తి 

మేడ్చల్, జూలై 4 (విజయక్రాంతి): కాం గ్రెస్ నాయకుల కబ్జాలో ఉన్న పార్కు స్థలా న్ని కాపాడింది. లే ఔట్ వేసినప్పుడు పార్కు గా చూపించి.. తర్వాత ప్లాట్లుగా మార్చేస్తున్న వైనాన్ని అడ్డుకుంది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం, గ్రామంలోని సర్వే నంబర్ 873, 882లో 13.31 ఎకరాల మేర 256 ప్లాట్లతో సాయి శ్రీ నిలయ పేరిలట 2000 సంవత్సరంలో లే ఔట్ వేశారు. ప్లాట్ నంబర్లు 111, 112, 113, 114, 115, 116 కలిపి మొత్తం 1,970 చదరపు గజాల విస్తీ ర్ణం పార్కు కోసం కేటాయించారు. ఇందులో ని సుమారు 400 చదరపు గజాల స్థలాన్ని  అక్రమంగా ఆక్రమించి, ప్లాట్లుగా విభజించి, ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాకులతో ప్రహరీ నిర్మించారని సాయి శ్రీ నిలయ రెసిడెన్సీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

రాజకీయ నాయకులే పార్కు స్థలాన్ని ఆక్రమించి ఫ్రీ కాస్ట్ కాంక్రీట్ బ్లాక్ లతో ప్రహరీ నిర్మించారు. అప్పట్లో కాలనీవాసులు అడ్డుకున్నారు. కానీ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడిలకు తలొగ్గారు . దీంతో కాలనీవాసులు హైడ్రాక్ ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పార్కు కబ్జాను నిర్ధారించుకుంది. శనివారం ఈ మేరకు పార్కు స్థలంలో ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాకులతో నిర్మించిన ప్రహరీలను తొలగించింది. పార్కు హద్దులను నిర్ధారించింది.

పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. పార్కు స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. శనివారం హైడ్రా కాపాడిన పార్కు స్థలం విలువ రూ. 20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కబ్జాలను తొలగించి 1970 గజాల పార్కును కాపాడిన హైడ్రాకు కాలనీ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సంబంధిత శాఖల అధికారులతో పాటు.. కాలనీవాసులతో విచారించి చర్యలు తీసుకోవడాన్ని అభినందించారు.