4 June, 2026 | 1:38 AM

లైన్‌మెన్ కుటుంబానికి కోటి బీమా

04-06-2026 12:00 AM
  1. చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి 
  2. యూబీఐ బ్యాంకుతో ఒప్పందం.. కార్మికులకు వరం

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ సో న్కాంబ్లే ప్రమోద్ కుమార్ సతీమణి (నామినీ) సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ప్రజాభవన్‌లో అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. యూఎస్‌ఎస్‌ఏ 2/యూఎస్‌ఎస్‌ఏ 3 పథకాల కింద శాలరీ ఖాతాలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ. 1 కోటి విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు.

ఈ పథకంలో భాగంగానే ఎన్పీడీసీఎల్ బాసర పరిధిలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్, 23 సెప్టెంబర్ 2024న బాసర శాఖలో తన ‘యూఎస్‌ఎస్‌ఏ -2’ శాలరీ ప్యాకేజీ ఖాతాను ప్రారంభించా రు. అయితే, దురదృష్టవశాత్తు ఆయన 24 మార్చి 2025 న విధి నిర్వహణలో ఉండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణం తర్వాత, మృతుని నామినీ అయిన సోన్కాంబ్లే స్వప్న క్లెయిమ్ దరఖాస్తును బాసర శాఖలో సమర్పించారు.

ఈ క్రమంలో రూ. 1 కోటి బీమా మొత్తం మే 30, 2026 నాడే స్వప్న సేవింగ్స్ ఖాతా లో జమయింది. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, యూనియన్ బ్యాంక్ సీఈవో అశిష్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేష్ ప్రసా ద్, చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, నిజామాబాద్ రీజినల్ హెడ్ అరుణ సవిత, చీఫ్ మేనేజర్ వై.వీ రాఘవ, బ్రాంచ్ మేనేజర్ విజయ్‌కుమార్, పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.